యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీర్ణియించుకోలేకపోతున్నారని వైకాపా అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఐదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.
జాతీయ నేతలు పిలవకున్నా పక్క రాష్ట్రాలకు వెళ్తూ చంద్రబాబు మన రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకు ప్రతికూలంగా రావడంతోనే వాటిపై నమ్మకం
లేదంటున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం సిగ్గు చేటని విమర్శించారు. చంద్రబాబు హుందాతనాన్ని కోల్పోయి.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని
విమర్శించారు.