YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ఉనికి కోల్పోతున్నదునే.. జాతీయ రాజకీయాల్లోకి... బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా

 ఏపీలో ఉనికి కోల్పోతున్నదునే.. జాతీయ రాజకీయాల్లోకి...           బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో ఉనికి కోల్పోవడం ఖాయమని తెలిసే.. జాతీయ రాజకీయాల్లో ఉండాలనే చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఎద్దేవా చేశారు.ఏపీలో సైకిల్ పంచర్ అయ్యిందని గాలి లేకపోయినా ఏదో ఉన్నట్లుగా హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం  మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపాలన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఉందంటూ చంద్రబాబు చేసిన అసత్య ప్రచారం వైసీపీకి లాభం చేకూర్చిందని మాధవ్ పేర్కొన్నారు. రాజకీయాలలో చంద్రబాబు వంటి దగాకోరు నేత ఎవరూ లేరన్నారు. ఈవీఎంలు టాంపరింగ్ చేశారని చెప్పిన చంద్రబాబు.. ఎలా జరిగాయో కూడా చెప్పాలని నిలదీశారు.లగడపాటి సర్వే నిజమైతే.. చంద్రబాబే ఈవీఎం లు టాంపరింగ్ చేసినట్లు అంగీకరిస్తారాఅని ప్రశ్నించారు. దొంగే .. దొంగ దొంగ అని అరచినట్లుగా చంద్రబాబు తన తప్పులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్దహస్తులన్నారు. వైసీపీ, బీజేపీలు ఎక్కడైనా కలిసి ప్రయాణం చేశాయా.. నిరూపించాలని మాధవ్ డిమాండ్ చేశారు. తాము ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జనసేన ఓట్లు చీలికతో గెలుస్తామనుకున్న చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టిందన్నారు. ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండుగా చీలడం ఖాయమన్నారు. ఒక వర్గం నారా వారి తరపున మరో వర్గం ఎన్టీఆర్‌ కుటుంబం తరపున ఉంటారని మాధవ్ పేర్కొన్నారు.

Related Posts