YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇస్రో గఘన విజయం

ఇస్రో గఘన విజయం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇస్రో శిఖలో మరో కిలికితురాయి చేరింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46‌ని బుధవారం ఉదయం 5.30 గంటలకు విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభం కాగా, సరిగ్గా బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ46 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో అంతరిక్ష ప్రయోగాల్లో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ - ఇస్రో... మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 5.30కి PSLV-C46 రాకెట్ ద్వారా... రీశాట్-2బీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపి... కక్ష్యలో ప్రవేశపెట్టింది. 615 కేజీల బరువున్న రీశాట్-2బీ... అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూ పరిశీలనా ఉపగ్రహం. నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రం నుంచి తెల్లవారు జామున 5.30 గంటలకు సీఎస్ఎల్వీ-సీ46 రాకెట్‌ విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో... 48వ PSLV రాకెట్‌ను వాడినట్లైంది. ఇందుకోసం ప్రత్యేకంగా బూస్టర్లు లేకుండా అంతరిక్షంలోకి వెళ్లే కోర్‌ అలోన్‌ (PSLV-CA) రాకెట్‌ను ఎంచుకుంది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇది 14వసారి. ఇందులో నాలుగు దశలున్నాయి. 1, 3 దశల్లో మోటార్లు ఘన ఇంధనంతో, 2, 4 దశల్లోని మోటార్లు ద్రవ ఇంధనంతో పనిచేస్తాయి. అర్ధరాత్రి ఇంధనం నింపే పని పూర్తి చేశారు. ఆపై ఎలక్ట్రానిక్ వ్యవస్థల్ని పరిశీలించి, ప్రయోగానికి 15 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ అధీనంలోకి తీసుకున్నారు.ప్రయోగం మొదలైన 15.29 నిమిషాలకు భూమి నుంచి 558 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్ చేరుకుంది. భూమధ్య రేఖకు 37 డిగ్రీల వాలులోని లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో రీశాట్‌-2బీని వదిలిపెట్టింది.ఈ ఉపగ్రహాన్ని ఆకాశంలో ఇస్రో కన్నుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన ఎక్స్‌బాండ్‌ రాడార్‌ దేశ సరిహద్దులపై అనుక్షణం కన్నేస్తూ ఉగ్రవాద శిబిరాలు, వాది కదలికలను పసిగట్టి ఫొటోలు పంపిస్తు్ంది. అలాగే దేశంలోని వ్యవసాయ, అటవీ రంగాల సమాచారంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో ఉపయోగపడనుంది. మేఘాలు ఉన్నా అన్ని వేళలా స్పష్టమైన ఫొటోలు తీసిపంపగలదు. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు.ఇక భారతీయులు గర్వంగా చెప్పుకునే చంద్రయాన్-2కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జూలై 9 నుంచి 16లోపు చంద్రయాన్‌-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ శివన్ తిరుమలలో తెలిపారు. ఈ ప్రయోగం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్న ఆయన... సెప్టెంబరు 6న చంద్రుడిపై చంద్రయాన్‌-2 రోవర్‌ దిగుతుందని వివరించారు. ఈ సంవత్సరం మరిన్ని ప్రయోగాలు చేయబోతున్నట్లు తెలిపారు.

Related Posts