Highlights
- వడ్డీ రేట్లను పెంచుతామంటూ ఫెడ్ సంకేతాలు
- దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- వరుసగా మూడోరోజూ నష్టపోయిన మార్కెట్లు
వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లు నష్టాల బాటలో పయనించాయి.శుక్రవారం ట్రేడింగ్ లాభాలతోనే ఆరంభమయినప్పటికీ... ర్లుఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు క్రమంగా రెడ్ మార్క్ లోకి జారుకున్నాయి. వడ్డీ రేట్లను పెంచుతామంటూ అమెరికా ఫెడ్ సంకేతాలను ఇవ్వడంతో... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. చివరకు సెన్సెక్స్ 137 పాయింట్లు నష్టపోయి 34,047 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 10,458 వద్ద స్థిరపడింది.