YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈవీఎంలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఈసీ కంట్రోల్ రూం

 ఈవీఎంలపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఈసీ కంట్రోల్ రూం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఈవీఎంలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) 24 గంటలు పనిచేసేలా ఈవీఎం కంట్రోల్ రూంను ప్రారంభించింది.

ఈవీఎంలపై ఎలాంటి ఫిర్యాదులైనా ఈవీఎం కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఈ

కంట్రోల్ రూంకు ఫిర్యాదులు చేయవచ్చు. ఈవీఎం కంట్రోల్ రూం ఫోన్ నంబరు 011-23052123 కి ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. ఈ ఈవీఎం కంట్రోల్

రూం 24 గంటలు పనిచేస్తూ ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని ఈసీ వివరించింది.ఈవీఎంలపై నెలకొన్న పలు అనుమానాల నేపధ్యంలో పలు రాజకీయ పార్టీలు మరింత

అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యూపీలోని విపక్ష నేతలు మీరఠ్‌లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌పై దృష్టి సారించేందుకు టెంట్ వేసుకుని కూర్చుంటున్నారు. వారు ఉదయం వేళ సీసీటీవీలను

చూస్తూ, రాత్రి వేళలో టెలీస్కోప్‌ల సాయంతో స్ట్రాంగ్‌రూమ్‌ను పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని విపక్ష నేతలు ఏ క్షణమైనా ఈవీఎంల గడబిడ జరగవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ

నేపధ్యంలో మహాకూటమి అభ్యర్థి హాజీ యాకూబ్ ఖురేషీ మద్దతుదారులు స్ట్రాంగ్‌రూమ్ గేటు ముందు టెంట్ వేసుకుని 24 గంటలూ అక్కడే కూర్చుంటున్నారు. కాగా స్ట్రాంగ్ రూమ్ ముందు రెండు

ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. వీటిని అనుక్షణం తిలకిస్తున్న విపక్ష నేతలు, కార్యకర్తలు ఒక్క క్షణం ఎల్ఈడీ ఆగిపోయినా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Related Posts