ఏపిలో ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకంతో ఉన్న వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక వైపు అధికారుల కూర్పుపై కసరత్తు ముమ్మరంగా సాగిస్తూనే మరో వైపు మంత్రివర్గ ఏర్పాటుపై కూడా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వర్గ కూర్పునకు సంబంధించి ఆయన ఒకరిద్దరితో తప్ప వేరెవరితో మాట్లాడలేదు. ఎంతో గుంభనంగా సాగుతున్న ఈ కసరత్తు అన్ని వర్గాలను సంతృప్తి పరచే విధంగా ఉందని అంటున్నారు. అయితే ముందుగా తనతో బాటు ఇద్దరినో ముగ్గురినో మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది. అతి ఎక్కు స్థానాలు దక్కించుకునే రెండు మూడు ప్రాంతీయ పార్టీలలో ఒకటిగా ఉండబోతున్నందున కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇద్దరు ముగ్గురితో సరిపుచ్చి సావకాశంగా పూర్తి స్థాయి మంత్రివర్గానికి వెళతారని కూడా అవకాశం ఉంది.కాగాఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే వారికి మద్దతునిస్తామని ఆయన ఇప్పటికే స్పష్టం చేసి ఉన్నందున తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురితో ఏర్పాటు చేసే మంత్రివర్గం సమావేశం జరిపి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేస్తారని తెలిసింది. ఈ తీర్మానాన్ని కేంద్రంలో ప్రభుత్వం
ఏర్పాటు చేసే అవకాశం ఉన్న పార్టీ తెలిపి దానికి ఓకే అంటే అదే పార్టీకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తుంది. మంత్రివర్గ తీర్మానాన్నిశిరసావహిస్తామని కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే
పార్టీ తరపున పెద్దలు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియచేయాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గం ఏర్పాటుపై చేసిన కసరత్తు ఈ విధంగా
ఉందని అంటున్నారు.