YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతికి నేతల క్యూ

అమరావతికి నేతల క్యూ

మరో 24 గంటలు వేచి చూస్తే చాలు... నేతలందరిలో, ప్రజల్లో ఉన్న ఉత్కంఠ తొలగిపోతుంది.  మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కౌంటింగ్ ట్రెండ్స్ తెలిసిపోతాయి. చంద్రబాబు సర్కారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకోనున్నారా? జనసేన కింగ్ మేకర్ అయ్యేనా? వంటి ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గురువారం నాడు ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్, 30కిపైగా పట్టణాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.డెసిషన్ డే రాజకీయ పార్టీల్లో హీట్ పుట్టిస్తున్న వేళ, ప్రధాన పార్టీల నేతలంతా అమరావతికి క్యూ కట్టారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల కోసం సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి జగన్ హెలికాప్టర్ లో బెజవాడ పయనం అయ్యారు. ఆయన వెంట హెలికాప్టర్ లో పార్టీ ముఖ్యనేతలు కూడా ఉన్నారు. గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయవాడలోని వైసీపీ కార్యాలయం నుంచి జగన్ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను పరిశీలించనున్నారు. కాగా, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానికి ఈవీఎం ఓట్ల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే విజయవాడకు చేరుకుని, సమీక్షలు నిర్వహిస్తుండగా, సాయంత్రానికి వైఎస్ జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రేణిగుంటకు చేరుకోనున్న చంద్రబాబు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి తిరిగి రాత్రికి అమరావతికి రానున్నారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది.

Related Posts