ఎన్నికల ముందు సమన్వయం కోల్పోకుండా ఉండాలని దేశంలోని ఏ కార్యకర్త కష్టం వృధా కాదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఎగ్జిట్ పోల్స్
దుష్ప్రచారం చేస్తున్నాయని, తప్పుడు సర్వేలని రాహుల్ కొట్టిపారేశారు. మరో 24గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ భయపడవద్దని కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించారు. మరొక్క రోజు కౌంటింగ్ ఉందనగా కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ కింది విధంగా ట్వీట్ చేశారు.ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలారా.. తదుపరి24గంటలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ భయపడవద్దు. నకిలీ ఎగ్జిట్ పోల్స్ దుష్ప్రచారానికి మీరు నిరాశ పడవద్దు. మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉండండి. మీ కష్టం వృధా కాదు అని రాసుకొచ్చారు.ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటును తెలియజేశాయి. ఎగ్జిట్ పోల్సే కనుక నిజమైతే కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఆశాభంగం తప్పదనే నిరాశ కాంగ్రెస్ కార్యకర్తల్లో పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్ తన సందేశంతో కార్యకర్తల్లో మనోదైర్యాన్ని నింపారు.