2018లో సెలవులే.. సెలవులు
2018 సంవత్సరంలో సెలవులే.. సెలవులు. లాంగ్ వీకెండ్స్‌తో పండుగ చేసుకోవచ్చు. లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరమంతా లాంగ్ వీకెండ్స్‌తో లాంగ్ టూర్లు వేసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. జనవరి చివరి వారం నుంచే వీకెండ్స్‌తో ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. జనవరి 26(శుక్రవారం) రిపబ్లిక్ డే కాబట్టి శనివారం ఒక్క రోజు సెలవు తీసుకుంటే మూడు రోజులు ఎంజాయ్ చేయొచ్చు. సాధారణంగా ఐటీ, బ్యాంకింగ్(రెండు, నాలుగో శనివారాలు) సెక్టార్లలో ఉన్న వారికి శనివారాలు కూడా హాలిడేసే. మిగతా సెక్టార్లలో ఉన్న వారు కూడా ఆ ఒక్క రోజు లీవ్ పెట్టేస్తే అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి.. జనవరి చివరి వారాన్ని ఆహ్లాదంగా గడిపేయొచ్చు. ఫిబ్రవరి 10న రెండో శనివారం. 13(మంగళవారం)న మహాశివరాత్రి. 12వ తేదీ సోమవారం రోజున సెలవు పెట్టేస్తే నాలుగు రోజులు కలిసి వస్తాయి. మార్చి నెలలో టూ వీకెండ్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు. 2వ(శుక్రవారం) తేదీన హోలీ పండుగ. శనివారం రోజు లీవ్ పెట్టేసుకుంటే మూడు రోజులు ఎంజాయ్ మీదే. ఇక మార్చి చివరి వారంలో 29 నుంచి(31న శనివారం సెలవు పెట్టుకుంటే) ఏప్రిల్ 1వ తేదీ వరకు నాలుగు రోజులు సెలవులే. 29న మహావీర్ జయంతి, 30న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 1న ఈస్టర్. ఏప్రిల్ నెలలో 28(శనివారం)న, 30(సోమవారం)న సెలవు పెట్టుకుంటే.. మే 1వ తేదీన మేడే సెలవు కాబట్టి నాలుగు రోజులు కలిసివస్తాయి. జూన్ నెలలో 15వ(శుక్రవారం) తేదీన ఈద్ ఉల్ ఫ్తిర్‌న సెలవు కాబట్టి.. శనివారం సెలవు పెట్టుకుంటే మూడు రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఆగస్టు నెల ఐటీ, బ్యాంకింగ్ రంగం వారికి కలిసి వస్తుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం 16, 17 తేదీల్లో లీవ్స్ పెట్టుకుంటే శని, ఆదివారాలు కలిసి వస్తాయి కాబట్టి వరుసగా ఐదు రోజులు సరదాగా గడిపేయొచ్చు. సెప్టెంబర్ 13(గురువారం)న వినాయక చవితి. 14, 15న లీవ్ తీసుకుంటే 16(ఆదివారం)తో కలిపి నాలుగు రోజుఉ ఎంజాయ్ చేయొచ్చు. అక్టోబర్ 2(మంగళవారం)న గాంధీ జయంతి. సెప్టెంబర్ 30 ఆదివారం కాబట్టి.. అక్టోబర్ 1న సెలవు తీసుకుంటే మూడు రోజులు కలిసి వస్తుంది. ఫుల్‌గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. నవంబర్ నెలలో 7(బుధవారం)న దీపావళి. 8, 9 తేదీల్లో లీవ్స్ పెట్టుకుంటే.. రెండో శనివారం, ఆదివారంతో కలిపి వరుసగా ఐదు రోజులు ఆహ్లాదంగా ఉండొచ్చు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ(25వ తేదీ) మంగళవారం వస్తుంది. సోమవారం లీవ్ పెట్టుకుంటే మూడు రోజులు కలిసి వస్తుంది. ఇలా మంచి ప్రణాళికతో 2018లో వీకెండ్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు.