YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ఎన్కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్

Highlights

  •  ఫోరెన్సిక్ డాక్టర్లతో పోస్టుమార్టం జరపాలి 
ఎన్కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్


చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ పై  హైకోర్టులో పౌరహక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. మావోయిస్టుల మృతదేహాలు హైదరాబాద్ తరలించి భద్రపరచాలని, నిపుణులైన ఫోరెన్సిక్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలని, ఎన్కౌంటర్పై పూర్తిస్థాయి విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
హరిభూషన్ మృతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందారు. మరో కీలక నేత బడే చొక్కారావు కూడా నేలకొరిగారు. పోలీసులు వీరి మరణాలను ధృవీకరించారు. కీలక నేతలు, ఆరుగురు మహిళలు సహా మొత్తం 10 మంది ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన మమిళల్లో హరిభూషణ్ సహచరి సమ్మక్క కూడా ఉన్నారు. ఎదురుకాల్పుల్లో పోలీస్ కమాండో సుశీల్ కూడా చనిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ కు  గాయపడినట్లు సమాచారం.

Related Posts