యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడికి ఎంత వ్యతిరేకత ఉందో పోస్టల్ బ్యాలెట్‌లోనే అర్ధమైపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలలో విజయం సాధించినా అశ్చర్యం లేదు. కుప్పంలో చంద్రబాబునాయుడికి పోస్టల్ బ్యాలెట్‌లోనే చుక్కలు కనిపించాయి. పోస్టల్ బ్యాలెట్‌లో ఆయన 350 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడి పాలనపై వ్యతిరేకత పెల్లుబికింది. ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు లీడ్‌లోకి వచ్చేస్తున్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరూ అని కూడా చూడకుండా మెజారిటీలు సాధించే దిశగా పరిస్థితి సెట్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత ఉందని అంచనా వచ్చింది కానీ ఇంత దారుణంగా ఆ పార్టీ ఓడిపోతుందని చాలా మంది అనుకోలేదు. ఎగ్జిట్ పోల్ అంచనాలను తప్పని నమ్మించేందుకు చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నించినా అసలు ఫలితాలు అంతకన్నా దారుణంగా వచ్చేస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం కావడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబునాయుడి పాలనలో అవినీతి, బంధుప్రీతి వీటన్నింటితో బాటు ఒక కులం చేతిలో రాజ్యాధికారం బందీ అయిపోవడం, దౌర్జన్యాలు, దాష్టీకం ప్రజలు సహించలేని స్థితిలో కొనసాగింది. కేవలం ఒక కులం ఆధిపత్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరస్కరిస్తున్నాయి. వీటన్నింటిని కప్పి పుచ్చుకుంటూ లగడపాటి రాజగోపాల్ తన సర్వేని విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభంజనం వీస్తున్‌తదని చెప్పిన లగడపాటి ఆ తర్వాత వచ్చిన ఫలితాలు చూసి ఖంగు తిన్నారు. ఇప్పుడు అలాంటి పొరబాటు జరగలేదని, తాను కచ్చితంగా చెబుతున్నానని అన్నారు. అయితే ఇప్పుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దీనికి లగడపాటి తలెక్కడ పెట్టుకుంటారో వేచి చూడాలి.