యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కౌతళం : మండలంలో పలుచోట్ల ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. గాలివాన బీభత్సం సృష్టించింది వడగండ్ల వాన కురిసింది. రైతులు ఆనందం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సంపూర్ణ ప్రజా తీర్పు ఇచ్చారు. ముఖ్య మంత్రి స్వర్గీయ రాజశేఖరరెడ్డి హయాంలో బారి వర్షాలు కురిసి ప్రజలు,రైతులు ఆనందంగా సంతోషంగా ఉన్నారని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కాబోయే ముఖ్య మంత్రి అవడంతో వర్షాలు పడ్డాయని ప్రజలు పేర్కొన్నారు. రాష్ట్రం కరువు తో విలవిల లాడింది అన్నారు. ఇప్పటి నుంచి మంచి రోజులు రావాలని సకాలంలో వర్షాలు కురవ లని రైతులు ఆనందం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.అక్కడక్కడ పిడుగులు పడ్డాయి.వర్షాలు కురవడంతో వాతావరణం చల్లా బడటంతో రైతులు,ప్రజలు ఊపిరి పీల్చు కున్నరు.