యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రతికూలత! ఏ వ్యక్తి జీవితంలో అయినా ఇది సర్వసాధారణం. ఇక, రాజకీయాల్లోనూ ఇది కామన్. అయితే, ఏపీ ప్రతిపక్షం గా ఇప్పటి వరకు ఉన్న వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొన్న ప్రతికూలతలు మరిన్ని. ముఖ్యంగా అధికార పార్టీ ఆయనను ఓ చీడ పురుగుమాదిరిగా చూసింది. 2014లో దాదాపు 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ అధినేతకు కనీస మర్యా ద కూడా ఇవ్వలేదు. పైగా ఆయనను నేరస్తుడని, ఆర్థిక దొంగ అని తీవ్ర పదజాలంతో చంద్రబాబే స్వయంగా ఆరోపించారు. అసెంబ్లీలోనూ ఆయనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.అంతేకాదు.. జగన్ సాధించిన 67 మంది ఎమ్మెల్యేలలో కూడా దాదాపు పాతిక మందిని చంద్రబాబు తన కూటమిలో చేర్చుకున్నారు. తద్వారా.. ఏపీలో జగన్‌ను పూర్తిగా అంతం చేయాలని బాబు భావించారు. ఇక, అడుగడుగునా ఆయనతో తీవ్రంగా విభేదించారు. ప్రతి విషయంలో వైసీపీని నెగిటివ్‌గా చూపిస్తూ.. టీడీపీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఇక, పాదయాత్ర ప్రారంభించిన సమయంలోనూ జగన్‌పై అనేక వ్యాఖ్యలు చేశారు. ఉదయపు నడక, సాయంత్రపు నడగగా టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా మొత్తానికి జగన్‌ను ఎక్కడికక్కడ తీవ్రస్థాయిలో కించపరిచారు.అదేసమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లోనూ జగన్‌ను తీవ్రస్థాయిలో ఎదుర్కొనేందుకు ఆయన వ్యవహరించారు. అ యినప్పటికీ.. వ్యూహాత్మకంగా జగన్ ఈ ప్రతికూలతలను ఎదుర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల దూకుడును అధిగమించా రు. ఎన్ని విమర్శలు వచ్చినా పాదయాత్రను నిరాఘాటంగా కొనసాగించారు. మొత్తానికి ప్రజల ఆశీర్వాదం పొందడంలో జగన్ పూర్తిగా సక్సెస్ అయ్యారనే విషయం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ చంద్రబాబు కంచుకోటలను కూడా వైసీపీ కూలగెట్టింది. మొత్తంగా ఈ అనూహ్య విజయం, ప్రభంజనం వెనుక తనకు ఎదురైన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకున్న జగన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు