YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు పెరిగిన సెక్యూరిటీ

జగన్ కు పెరిగిన సెక్యూరిటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జగన్ కు వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని 'ఏపీ 18పీ 3418' నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసాన్ని, దాన్ని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జగన్ ఇంటికి దారితీసే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి, ఆ రూట్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి కావడంతో, నిబంధనల మేరకు భద్రతను పెంచామని ఉన్నతాధికారులు అంటున్నారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్ర పరిస్థితులను సమీక్షించనున్నారు. చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఆపై వైసీపీ తరఫున గెలిచిన అభ్యర్థులతోనూ జగన్ సమావేశం కానున్నారు.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయ పతాకాన్ని ఎగురవేసి, అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి, దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తరువాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా నిలిచింది. దేశవ్యాప్తంగా 542 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్ కు 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తరువాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9, సమాజ్ వాదీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నా డీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు

Related Posts