YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30న మోడీ ప్రమాణం

30న మోడీ ప్రమాణం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

న‌రేంద్ర మోదీ రెండ‌వ‌సారి ప్ర‌ధానిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుమారు 4 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మోదీ... ఈనెల 28వ తేదీన అక్క‌డ‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. స్వంత రాష్ట్రం గుజ‌రాత్‌కు కూడా ఈనెల 29న మోదీ వెళ్తార‌న్న స‌మాచారం వినిపిస్తున్న‌ది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నరేంద్ర మోదీ సాయంత్రం కలిశారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కోవింద్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను రాష్ట్రపతికి మోదీ సమర్పించారు. మోదీ రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 స్థానాలు రావడంతో.. రెండోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Related Posts