YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అభయ్ రామ్ కి తోడొచ్చేదెవరు..?

Highlights

 

  • తమ్ముడు పుడతాడా, చెల్లి పుడుతుందా..?
  • మేలో మరో బేబికి జన్మనివ్వనున్న ప్రణతి 
  • మరోసారి తండ్రి అవుతున్న ఎన్టీఆర్ 
అభయ్ రామ్ కి తోడొచ్చేదెవరు..?

నందమూరి.అభయ్ రామ్ కి తోడుగా ఈ సారి పుట్టేదెవరో అన్న ఆసక్తి ఇటు కుటుంబంలోనూ.. అటు అభిమానుల్లోనూ రోజు రోజుకు పెరిగిపోతుంది. తమ్ముడు పుడతాడా, చెల్లి పుడుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేలో ప్రణతి మరో బేబికి జన్మనివ్వనున్నట్టు సినిమాలోకం కోడై కూస్తుంది.నందమూరి వంశ యువకిశోరం ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమను దావానంలా పాకిన సంగతి తెలిసిందే.

ప్రణతి, ఎన్టీఆర్ దంపతులకి ఇప్పటికే అభయ్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఉండగా, త్వరలో వారింట మరో చిన్నారి అడుగు పెట్టనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయే సరికి అభిమానులు ఈ వార్తని లైట్ గా తీసుకున్నారు. కాని తాజాగా ఓ ఫంక్షన్ లోమెరిసిపోతూ కన్పించిన ప్రణతిని చుసిన తర్వాత అభిమానుల అందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంది.. నందమూరి ప్యామిలీలోకి మరో ఆణిముత్యం రాబోతుందంటూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. 


 ఇక ఎన్టీఆర్ ఈ నెలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించబోయే తాజా చిత్రం సెట్స్ పైకి రాబోతుంది. మే వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని రోజులు ఫ్యామిలీతో ఆనంద క్షణాలు గడుపుతాడట. ఇక ఈ ఏడాది చివరిలో రాజమౌళితో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్చేయనున్నాడు ఎన్టీఆర్. మరో వైపు బిగ్ బాస్ 2 రియాలిటీ షోని కూడా హోస్ట్ చేస్తాడని తెలుస్తుంది.

Related Posts