యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్ణాటకలోని మొత్తం 28 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 25 చోట్ల గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటి, జేడీఎస్ ఒక్క స్థానంలో విజయం సాధించాయి. హసన్ స్థానంలో జేడీఎస్
నుంచి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందారు. జేడీఎస్‌కు కంచుకోట లాంటి ఈ స్థానంలో మాజీ ప్రధాని దేవెగౌడ మూడు సార్లు గెలుపొందారు. ఈసారి తన మనవడి మనవడి రాజకీయ
అరంగేట్రం కోసం దేవేగౌడ తన కంచుకోటను వదులుకున్నారు. దేవెగౌడ త్యాగం వృధా కాలేదు. ఇక్కడ ప్రజ్వల్ విజయం సాధించారు. కానీ, కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన దేవేగౌడకు
నిరాశ తప్పలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బస్వారాజ్ చేతిలో ఓటమిపాలయ్యారు. తన కోసం త్యాగం చేసిన తాతయ్య ఓడిపోవడంతో ప్రజల్వ్ తీవ్రంగా కలతచెందాడు. తిరిగి తాతను పార్లమెంట్‌కు
పంపేందుకు తాను రాజీనామా చేస్తానని వెల్లడించాడు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేవేగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా.. ఒక్కరికి మాత్రమే విజయం దక్కింది. తొలుత దేవెగౌడ హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే తన కుమారుడు రేవణ్ణ తనయుడు ప్రజ్వల్‌ను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం ఆయన తన సీటును త్యాగం చేశారు. హసన్‌లో ప్రజ్వల్‌ను నిలిపిన దేవేగౌడ తుమకూరు నుంచి పోటీ చేశారు. జేడీఎస్ కంచుకోటలో ప్రజ్వల్ సునాయాసంగా విజయం సాధించారు. కానీ, తాత ఓడిపోవడం ప్రజల్వ్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై స్పందించిన ప్రజ్వల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘కర్ణాటక ప్రజల కోసం మా తాత దేవెగౌడ అనేక త్యాగాలు చేశారు.. ఆయన ఓటమిని జేడీఎస్ కార్యకర్తలు తాను జీర్ణించుకోలేకపోతున్నాం... ఆయన పార్టీకి వెన్నుముక లాంటివారు.. కాబట్టి తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆయన గెలిచిన తర్వాతే సంబరాలు చేసుకుంటాం అని ప్రజ్వల్ వ్యాఖ్యానించాడు. తాతయ్య గెలుపు సాధించేవరకూ సంతోషంగా ఉండలేమని, ఇదే విషయాన్ని హసన్‌లోని జేడీఎస్ కార్యకర్తలతో చర్చించి, మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్టు వెల్లడించాడు. జేడీఎస్ కార్యకర్తలకు తాను చెప్పేది ఒకటేనని దేవెగౌడ విజయం సాధించి, ప్రజలకు సేవచేయాలని అన్నారు. జేడీఎస్ కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపాలంటే దేవేగౌడ లోక్‌సభకు వెళ్లాలని, అందుకోసం నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. హసన్‌లో జరిగే ఉప ఎన్నికల్లో దేవేగౌడ గెలుపు కోసం కృషి చేస్తానని, ఈ నియోజకవర్గం నుంచి ఆయన మళ్లీ విజయం సాధించాలని ప్రజ్వల్ తెలిపారు.