యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల మాట ఎలా ఉన్నా, తాజాగా వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 76 మంది మహిళలు చట్టసభ సభ్యులుగా ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించారు.
పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ఎన్నిక కావడం ఇదే ప్రథమమని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో66 మంది మహిళలు ఎన్నికై లోక్‌సభలో అడుగుపెట్టారు. యూపీ, పశ్చిమ బెంగాల్ నుంచి11 మంది చొప్పున ఎన్నికై రికార్డు సృష్టించారు.ఇక ఒడిశా నుంచి సైతం అధిక సంఖ్యలో మహిళలు ఎంపిక కాగా బీజూ జనతాదళ్ నుంచి ఏకంగా ఆరుగురు మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు అత్యంత ప్రభావశీలురైన సోనియాగాంధీ, మేనకా గాంధీ, హేమమాలినితో పాటు తాజాగా స్మృతి ఇరానీ తదితరులు సైతం ఈసారి కొలువైన లోక్‌సభలో దర్శనమివ్వనున్నారు.