YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోదీకి బాలీవుడ్ నటుడు షారూక్ కంగ్రాట్స్

మోదీకి బాలీవుడ్ నటుడు షారూక్ కంగ్రాట్స్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి విధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని పేర్కొన్నాడు. పనిచేసే వారికి పట్టం కడుతూ భారతీయులుగా గర్వపడేలా స్పష్టమైన తీర్పునిచ్చినట్టు చెప్పాడు. తమ ఆశలు, కలలు నిజం కావాలని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఘన విజయం సాధించిన మోదీకి ఘనమైన అభినందనలని షారూక్ పేర్కొన్నాడు.

Related Posts