వివాహాది శుభకార్యక్రమాలు, పూజలకు ఖచ్ఛితంగా ఉపయోగించేది తమలపాలకు. తమ పాకు లేకుండా ఏ శుభకార్యాన్ని చేయరు. హిందువులు, ముస్లింలు అందరూ తమల పాకులను ఏదో రూపంలో వినియోగిస్తుంటారు. ఒక వైపు వరి, మొక్కజొన్న, జొన్న లాంటి ఆహార వాణిజ్య పంటలను పండిస్తునే మరో వైపు తమలపాకు తోటలను పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి రైతు పొలంలో అర, ఒక ఎకరా పైబడి తమలపాకును సాగు చేశారు. ధన సంపాదనేకాకుండా తరతరలాలుగా వస్తున్న తోటల పెంపకాన్ని వారసత్వంగా త తీసుకుంటున్నారు. రోజువారిగా దాదాపు 20మందికి కూలి పనులు కల్పించి, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం వంద కట్టల మోపు రూ.2,500 నుంచి రూ.మూడువేల ధరల పలుకుతోంది. నెలకు రెండు కోతలు వస్తాయి. తమలపాకులను చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి సంతకు తీసుకెళ్లి విక్రయిస్తారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్ర వరకు ఆకులు కోసుకుని మరుసటి రోజు వాటిని సంతకు తీసుకెళ్తారు.అంతటి డిమాండ్ ఉన్న తమలపాకు సాగు రైతులకు లాభసాటిగా మారింది. వరి, వేరుశనగ పంటలతో నష్టాలను చవి చూసిన నల్లచెరువు మండల రైతులు తమలపాకు సాగుతో లాభాలు పండిస్తున్నారు.నల్లచెరువు మండల పరిధిలోని మారిశెట్టిపల్లి, కె.పూలకుంట, తనకల్లు మండల పరిధిలోని చెక్కవారిపల్లి గ్రామాల్లో 310 కుటుంబాలు నివసిస్తుయి. ఈ గ్రామాల్లో రైతులు తరతరాలుగా తమలపాకు తోటలను సాగుచేస్తున్నారు.తమలపాకు తోటల పెంపకానికి రైతులు పూర్తిగా సేంద్రీయ ఎరువులనే వినియోగిస్తున్నారు. పవుశువుల ఎరువును విరివిగా వినియోగిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి రసాయనిక ఎరువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో మేలురకం తమలపాకులను పండిస్తున్నారు. తమలపాకుతోట దీర్ఘకాలిక పంట కావడంతో ప్రతి సంవత్సరం పెట్టుబడి అవసరం లేకుండా లాభాలను చూస్తున్నారు. ఒకసారి తోటను పెంచితే దాదాపు పది సంవత్సరాల దాకా తమలపాకులు కాస్తూనే ఉంటాయి. తోటను కాపాడుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. క్రమంగా తమలపాకు తోటల సాగు మండలంలో పెరుగుతోంది. ప్రభుత్వం మరింత ప్రోత్సాహకం అందిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.