YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలిసి పని చేయాలి

కలిసి పని చేయాలి

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:     

ఎపి లోను, కేంద్రం లోను అధికారం లోకి వచ్చిన జగన్, మోడీలకు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ శుభాకాంక్షలు తెలిపరు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అన్నాక ప్రజా తీర్పు లో ఎవరో ఒకరు గెలవక తప్పదు. ఎన్నికలను యుద్దంలా ఎవరూ చూడొద్దు. ప్రజల కోసం అందరూ కలిసి పని చేయాలి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కేంద్రం నుంచి న్యాయ బద్దంగా రావాల్సిన వాటిని తెచ్చేందుకు కృషి చేయాలి. నేడు ఎన్నికలలో అభివృద్ధి, మౌలిక వసతుల అంశం ప్రస్తావనే లేదు. కుల మతాలు అంతరాలు, ప్రజలకు తాయిలాలు ప్రకటించడమే ఆనవాయితీ గా మారిందని వ్యాఖ్యానించారు. కులాల విభజనతో నేడు నడుస్తున్న రాజకీయాలు ప్రజలకు మంచిది కాదు. కులాల వల్ల ఒకస్థాయి ప్రజలకు మేలు తప్ప, సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారు. కులాల తో సమాజ విభజన ఎపి లో స్పష్టంగా కనిపించింది. ఇక అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు తాయిలాలు ప్రకటించి ప్రజలను సోమరులను చేస్తున్నారు. నేను ఇచ్చా, నేను ఇస్తా అని నేతలు చెప్పుకోవడం విడ్డూరం. ప్రజల సొమ్మును ప్రజలకే తమ స్వార్దం కోసం పంచి గొప్పగా చెప్పుకోవడం ఎపి నేతలకే చెల్లింది. కోట్ల రూపాయలు ఓట్ల కోసం ఖర్చు పెడితే.. వారు ప్రజాసేవ ఎలా చేస్తారు. ఇప్పడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే  ఎంత ఖర్చవుతుందో కూడా వారికే తెలియదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలు వీడి ఎపి కి న్యాయం చేసేలా వ్యవహరించాలని అన్నారు. నలుగురు జాతీయ స్థాయి ఆర్దిక నిపుణులు  ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఢిల్లీ నుంచి నిధులు తేలేని పక్షంలో.. మనం కట్టే వాటిని వినియోగించుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలి.  యనభై వేల కోట్లు రావాల్సి ఉన్నందున, వాటిని తెచ్చే అంశాల పై దృష్టి పెట్టాలని సూచించారు.
మంచి విద్య, వైద్యం అందించడం పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సురాజ్య యాత్ర ద్వారా అధ్యయనం చేసి విధివిధానాలను ప్రభుత్వాలకు, పార్టీలకు ఇచ్చాను. ఇప్పటికైనా సమగ్ర
ప్రణాళిక తయారు చేసుకుని వాటిని అమలు చేయాలి. ఇప్పుడు విద్య, వైద్యానికి వినియోగిస్తున్న డబ్బు కన్నా ఖర్చు తక్కువే అవుతుందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమ రంగాలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.

Related Posts