యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఓటర్లు తెలుగు దేశం పార్టీ ని గెలిపించినందుకు ఎమ్ ఎల్ ఏ వల్లభనేని వంశి మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో రెండొ సారీ తాను ప్రాతినిధ్యం వహించడం తనకి గర్వకారణం ఉందని వంశి అన్నారు. గడచిన ఐదు సంవత్సరాలు నియోజకవర్గం అభివృద్ధి కై చిత్తశుద్ధి తో పని చేశానని తమ పార్టీ అధికారంలో లేనప్పటికి నియోజకవర్గం అబివృద్ధికై నిరంతరం కృషిచేస్తా నని తెలిపారు. త్వరలో నియోజకవర్గం లోని కబ్జాకి గురైన ప్రభుత్వ భూములని పేదలకు పంచేలా దశల వారీ పోరాటానికి సిద్దమౌతున్నట్లు తెలిపారు