Highlights
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వైకాపా అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఏడు నెలల రిమాండ్ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజునే బెయిల్ మంజూరి అయింది. కానీ బెయిల్ పాత్రలు కారాగార అధికారులకు అందకపోవడంతో ఈ రోజు విడుదలయ్యాడు.. అసలా ఈ కోడి కత్తి వెనుక కథ ఏమిటి. ఇప్పుడు వరకు జైలు శిక్ష అనుభవించి సరిగ్గా జగన్ సీఎంగా మరికొద్దిసేపట్లో ఖరారు అవబోతుంది అనగా విడుదల చేసారు.
ఇప్పుడు ఈ కోడి కత్తి కథ ముగిసినట్లేనా... భారీ మెజారిటీతో జగన్ సీఎం కుర్చీని అధిష్టించారు. ఈ కోడి కత్తి కథ డ్రామానా... జగన్ సీఎం కావడానికి దాహోదపడేందుకు ఈ కథ నడిపించారా. కోడి కత్తి నిందితుడు ఈ రోజు జైలు నుంచి విడుదల అయినా వెంటనే మీడియాతో చెప్పిన మాటలు వింటే కోడి కత్తి కథ ఒక కట్టు కథలానే ఉంది.. నిందితుడు మీడియా తో మాట్లాడతూ "అది కావాలని చేసిన ప్రయత్నం కాదని, సమస్యలు వివరించాలని వెళ్లి జగన్‌కు చెబుతుండగా కంగారులో కత్తి తగిలిందని చెప్పుకొచ్చాడు. నేను జగన్ అభిమానినని, అటువంటి తప్పు చేశానని నిరూపిస్తే తల నరుక్కొంటానని అన్నాడు. ఆరోజు ఘటనానంతరం అక్కడి వారు నన్ను కొడుతుంటే జగనే రక్షించారని, ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయన దయేనన్నారు. అటువంటి మనిషి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు". తాను చెప్పిన మాటలు వింటుంటే ఈ కోడి కథకు ముగింపు పలికినట్లే అనిపిస్తుంది..
మరి ఈ జగన్ ప్రభుత్వంలో ఈ నిందితుడికి శిక్ష పడుతుందా.. తప్పు తెలుసుకున్నాడు కాబ్బటి క్షమించి వదిలేసి శాశ్వతంగా ఈ కేసు ని మూసివేస్తారో చూడాలి