YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

 హోలీ.. సందడే సందడి..

Highlights

  • రంగుల కేళిలో తారాలోకం
  • రంగులు జల్లుకోవడానికి హితవులు..
 హోలీ.. సందడే సందడి..

 హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. రంగుల కేళి హోలీ పండగ అంటే అందరికీ సంబరమే మరి.  ఈ పండగ చేసుకోడానికి వయసుతో సంబంధం లేదు. మనసు ఉత్సాహంగా ఉండాలే కానీ వృద్ధులు కూడా రంగులు పూసుకుంటారు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రులు, గోవర్నర్లు, అధికారులు, విద్యార్థులతో పాటుగా  సైనిక జవాన్లు ఈ రంగుల ప్రపంచంలో సందడి చేశారు. రంగుల లోకంలో తేలిపోయే సినిమా వారికి కూడా ఇది సంతోషాల వేదిక. సినీ తారల్లో ఈ రంగుల హంగులు మరింతగా కనబడతాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇక చెప్పక్కర్లేదు. సందడే సందడి. హోలీ సందర్భంగా చాలామంది సినీ సెలెబ్రిటీస్ తమ ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు శుభాకాంక్షలతో పాటు సలహాలు ఇచ్చారు. 

మీ జీవితంలో కూడా ఈ సంతోషపు రంగుల వెల్లువ ఎప్పటికీ ఉండాలని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా , హ్యాపీ హోలీ అంటూ..  ఈ రంగుల పండగ మీ జీవితాల్లో సంతోషం నింపాలని వివేక్ ఓబెరాయ్ చెప్పాడు. హోలీ కదా అని రంగులు కలపడంలో నీటిని వృధా చేయవద్దని కూడా అతనన్నాడు. లైఫ్ లో ప్రతి ముమెంట్ ను ఎంజాయ్ చేయాలన్నది. హోలీ ఆడేటప్పుడు సహజమైన రంగులే వాడాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరాడు. జీవితంలో కష్టాలు శాశ్వతం కాదని, సంతోషం కూడా వస్తుందని, పాజిటివ్ గా ఉండాలని నటి ఖుష్బూ సలహా ఇచ్చింది. హోలీ ఆడుకున్నా మూగ జీవులకు హాని చేయవద్దని హీరోయిన్స్ రాశిఖన్నా, హన్సిక సలహా ఇచ్చారు. 

హోలీకి కళ్లను దానం చేయమని మంచి సలహా ఇస్తూ.. సాయిధరమ్ తేజ్. రేణు దేశాయ్, వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండగ సంతోషంగా జరుపుకోమని, నీటినీ, ఆహారాన్ని వృథా చేయవద్దని సోహా అలీ ఖాన్ , ఇమ్రాన్ హష్మీ సలహా ఇచ్చారు. ప్రియాంక చోప్రా, జూహీ చావ్లా తదితరులు హోలీ పండుగ జరుపుకొని, అందరూ బాగుండాలని ఆకాంక్షించారు.


 

Related Posts