యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించే ప్రజాదర్బార్ (గ్రీవెన్సు) కార్యక్రమాన్ని ఈ నెల 27న (సోమవారం) కర్నూలు పట్టణం కలెక్టరేట్ లో ఉన్న సునయన ఆడిటోరియం నందు ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.