యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్‌కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే పది జట్లు ఆతిథ్య ఇంగ్లండ్‌కు చేరిపోయాయి. నెట్స్‌లో ప్రాక్టీస్, వామప్ మ్యాచ్‌లు కూడా మొదలెట్టేశాయి. టీమిండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు హాట్ ఫెవరెట్లుగా బరిలో దిగుతున్న ఈ ప్రపంచకప్ సమరంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు కూడా తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫామ్ కోల్పోయిన శ్రీలంక, సంచనాల విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు కూడా విశ్వకప్ సమరంలో తమ లక్ పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం పది జట్లు పాల్గొనే ప్రపంచకప్‌లో ప్రతీ జట్టూ, మిగిలిన 9 జట్లతో గ్రూప్ దశలో తలబడుతుంది. గ్రూప్ మ్యాచులు పూర్తయ్యేసరికి అత్యధిక విజయాలతో టాప్‌లో 4 జట్లు సెమీస్ చేరతాయి. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య జూలై 14న ఫైనల్ ఫైట్ జరుగుతుంది.