యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా వైఎస్ జగన్‌ను అభినందిస్తూ నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం మోడీతో జగన్ భేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రధానితో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా
ఆదుకోవాలని కేంద్ర సాయాన్ని వైఎస్ జగన్ కోరనున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక సమస్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే వైఎస్ జగన్‌కు నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమస్యలే ప్రధాన అజెండాగా ప్రధానితో వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు. కాగా వైఎస్ జగన్ ఈనెల 30వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు