తెలంగాణ సీఎం కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. మొదటిసారిగా ప్రగతి భవన్ కు వచ్చిన ఆయనకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని పుష్పగుచ్చం ఇచ్చి జగన్ ను లోపలికి ఆహ్వానించారు. అనంతరం శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.తెలంగాణ మంత్రులకు పేరుపేరున జగన్ కు పరిచయం చేసారు. జగన్ తో పాటు అయన భార్య భారతి, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు వున్నారు. ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులను జగన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురు చర్చించారు. ప్రగతి భవన్ బయట పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, పలువురు నేతలు తరలివచ్చారు.