యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ప్రత్యేక కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్ లో జగన్ ప్రధాని మోదీ నివాసానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరనున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా పలు కీలకమైన అంశాలపై మోదీతో జగన్ చర్చించినున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.