నేటి సాయంత్రం విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ నార్త్ జోడ్ ఏసీపీ రమేశ్ బాబు ఈ నోటీసులు జారీ చేస్తూ, వర్మకు కొన్ని సలహాలు ఇస్తూ, మరికొన్ని హెచ్చరికలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశమైతే, వ్యతిరేకించేవారు అడ్డుకుని ఘర్షణలు జరగవచ్చని హెచ్చరించారు. ఈ విషయమై పునరాలోచించుకుని ప్రెస్ క్లబ్ లేదా మరేదైనా సమావేశ మందిరాన్ని ఎంచుకుంటే తమకు అభ్యంతరం లేదని సూచించారు.