యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అనంతపురం జిల్లాలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని గార్లెదిన్నె మండలం తలదాసిపల్లిలో నిన్న అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం తలను తొలగించారు. ఈరోజు దాన్ని గమనించిన వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తలదాసిపల్లి మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు.