Highlights
- సినీ దర్శకుడు అర్జీ వర్మను అరెస్టు చేయాలి
- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మహిళా సంఘాలు
చిన్నారులను, యువతను పెడదోవ పట్టిస్తున్న పోర్న్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పోర్న్ సైట్స్ నిషేధించే వరకు పోరాడతాం అంటున్నారు. అటు మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం నిరాహారా దీక్షలకు సిద్ధమవుతున్నాయి మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి . ఈ విషయాలపై ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఓ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ.. విశ్లేషించారు. వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పోర్న్ సైట్స్‌పై మండిపడ్డారు.