YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశంలో నెంబర్ 2 సెంటిమెంట్

తెలుగుదేశంలో నెంబర్ 2 సెంటిమెంట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

టీడీపీలో ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ వస్తోంది. ఎవరైతే పార్టీలో నెంబర్ టూగా ఉంటారో వారి రాజకీయ భవిష్యత్తు శూన్యంలోకి పడిపోతోంది. అందుకు పలు ఉదాహరణలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ పార్టీలో ఎవరైతే నెంబర్ టూ స్థానం చెలాయించారో వారందరి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే సాంప్రదాయం తాజా ఎన్నికల్లోనూ రుజువయ్యింది. ఈ ఎన్నికల్లో లోకేష్ ఓటమి కూడా ఈ కోవలోకే చెందిందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత మంత్రిగా లోకేష్ అన్నిరకాలుగా నెంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నాడు. పార్టీ నిర్ణయాల్లోనూ, ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ చంద్రబాబు తర్వాత లోకేష్ నిర్ణయమే టీడీపీలో వేదంగా నడిచింది. అయితే నెంబర్ టూ స్థానంలో ఉన్న శని కారణంగానే లోకేష్ తొలిసారి పోటీలోనే అనూహ్యంగా ఓటమి చెందారని పార్టీవర్గాల్లో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇదంతా కొట్టి పారేసేవారికి గతంలో జరిగిన సంఘటనలనే సాక్ష్యాలుగా చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉండేవారు, అయితే పార్టీ పరంగానూ, ప్రభుత్వపరమైన నిర్ణయాల్లో అప్పటి మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నెంబర్ టూగా చెలామణి అయ్యారు. అయితే నాదెండ్ల తిరుగుబాటు తనదనంతర పరిణామాల తర్వాత ఆయన పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. దాదాపు ఆయన రాజకీయ జీవితం శూన్యమైపోయందనే చెప్పాలి.ఆ తర్వాత పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ వ్యవహరించారు. ఎన్టీఆర్ తర్వాత హరికృష్ణే అన్ని రకాలుగా వారసుడు అవుతాడని
అంతా భావించారు. ఎన్టీఆర్ కూడా తన వారుసుడు హరికృష్ణ అయితేనే బావుంటుందని భావించారు. అయితే ఆతర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో హరికృష్ణ ఏకంగా రాజకీయాలకు
దూరమైపోయారు. పార్టీలో కూడా పూర్తి ప్రాధాన్యతను కోల్పోయారు. అలాగే ఎన్టీఆర్ హయాంలోనే ఆయన సతీమణిగా వచ్చిన లక్ష్మీపార్వతి సైతం పార్టీలో నెంబర్ టూగా అనధికారికంగా చెలామణి అయ్యారు. ఎన్టీఆర్ తదనంతరం జరిగిన పరిణామాల్లో ఆవిడ రాజకీయ భవిష్యత్తు సైతం అగమ్యగోచరమైంది. అనంతరం చంద్రబాబు హయాంలో సైతం అప్పటి హోమంత్రి దేవేందర్ గౌడ్ ను అంత నెంబర్ టూగా భావించారు. ప్రస్తుతం ఆయన కూడా క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇలా పార్టీలో ఎవరైతే నెంబర్ టూ స్థానుంలో చెలామణి అయ్యారో వారి రాజకీయ జీవితాలు కనుమరుగై పోయాయి. తాజాగా నారా లోకేష్ సైతం మంగళగిరిలో భారీ ఓటమి చవిచూడటంతో ఈ సెంటిమెంట్ కు మరింత బలం చేకూరింది

Related Posts