YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఆ నలుగురు

విశాఖలో ఆ నలుగురు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వైసీపీ సునామీ మొత్తం విశాఖ జిల్లాను చుట్టేసింది. అయినా సరే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే పట్టం కట్టింది. నాలుగు దిక్కులే ఇపుడు సైకిల్ పార్టీకి దిక్కుగా మారాయి. విశాఖ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ తప్ప మిగిలిన జిల్లా అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇక చూస్తే ఓడిన చోట వైసీపీ తక్కువ తేడాతోనూ, గెలిచిన చోట భారీ ఆధిక్యతలతోనూ హవా సాగించంది. దాంతో విశాఖ సిటీలో వైసీపీకి బలమైన అభ్యర్ధులు లేకపోవడం, సరైన వ్యూహాలు అమలు చేయకపోవడం వల్లనే ఆ సీట్లు కోల్పయారని చెప్పకతప్పదు.విశాఖ నార్త్ నుంచి అతి స్వల్ప తేడాతో గంటా విజయం సాధించారు. రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో గంటా ఎపుడూ ఇంత తక్కువ మెజారిటీతో బయటపడలేదు. ఆయన గెలిచినపుడల్లా భారీ ఆధిక్యతలే నమోదు అయ్యాయి. గత ఎన్నికల్లో భీమిలీ నుంచి గెలిచినపుడు 38 వెలా పై చిలుకు మెజారిటీ గంటాకు దక్కింది. ఇక ఈసారి కేవలం మూడు వేలకే పరిమితం కావడం, పలు రౌండ్లలో వెనకబడడం, చివరి వరకూ గెలుపు టెన్షన్ అనుభవించడం బట్టి చూస్తే గంటా పొలిటికల్ గా బాగా వీక్ అయిపోయారని చెప్పేశాయి ఈ ఫలితాలు.ఇదిలా ఉండగా విశాఖ తూర్పు నుంచి ముచ్చటగా మూడవసారి గెలిచి వెలగపూడి రామ‌క్రిష్ణబాబు హ్యాట్రిక్ కొట్టేశారు. ఆయన 2009 నుంచి ఇదే సీట్లో గెలుపు సాధిస్తున్నారు. అప్పట్లో కొత్తగా ఏర్పడిన ఈ అసెంబ్లీ సీట్లో పోటీకి దిగిన వెలగపూడి కేవలం మూడు వేల తేడాతో గెలిచారు. గత ఎన్నికల్లో మెజారిటీ 48 వేలకు చేరుకుంది. ఈసారి వైసీపీ అభ్యర్ధిగా చివరి నిముషంలో రంగప్రవేశం చేసిన అక్రమాని విజయనిర్మల గట్టి పోటీ ఇచ్చారు. దాంతో వెలగపూడి మెజారిటీ సగానికి సగం తగ్గింది. అయినా విజయం సాధించడంతో హ్యాట్రిక్ విక్టరీ సొంతమైంది.ఇక విశాఖ సౌత్ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మీద చివరి రౌండ్ వరకూ పోరాడిన సిట్టింగ్ ఎమ్మెలే వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం మూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరసగా సౌత్ నుంచి రెండవమారు గెలిచి ఆయన సెంటిమెంట్ ని తిరగరాశారు. పార్టీలోని ఓ వర్గం సహకరించకపోయినా అయన గెలుపు సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్య్కతం చేస్తున్నారు. ఇక వెస్ట్ నుంచి గణబాబు కూడా వరసగా రెండవసారి విజయం సాధించారు. ఆయనకు వైసీపీ అభ్యర్ధి ప్రచరంలోనే గట్టి పోటీ ఇవ్వలేక చేతులెత్తేశారు. దాంతో విజయం ఖాయమని అంతా భావించారు. మొత్తానికి నగరానికి నాలుగు స్థంభాలుగా ఈ నలుగురూ గెలిచి టీడీపీ పరువు కాపాడారు.

Related Posts