Highlights
- మరింత జాగ్రత్తగా పీజీ అడ్మిషన్ల ప్రక్రియ
- నీట్ పద్ధతుల్లో అడ్మిషన్లు
- ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుఆ
- తాజా పరిస్థితులను బట్టి అడ్మిషన్ల ప్రక్రియ
- నీట్, పీజీ అడ్మిషన్లపై మంత్రి లక్హ్మారెడ్డి సమీక్ష
నేషనల్ పూల్ జాబితాలోకి తెలంగాణ రాష్ట్రం స్థానం సంపాదించుకుంది. దీనితో 50 శాతం సీట్లను నేషనల్ పూల్‌కి వదిలిపెట్టాల్సి ఉంటుంది. శుక్రవారం అలాగే, మన రాష్ట్ర విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అడ్మిషన్లు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఆ రకంగా దాదాపు మొత్తం 8 వేల మంది విద్యార్థులకు అవకాశాలు లభించవచ్చన్నారు. హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసులో అధికారులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఇక నుంచి మరింత జాగ్రత్తగా పీజీ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. త్వరలో నిర్వహించనున్న నీట్, పీజీ అడ్మిషన్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఇక నుంచి మరింత జాగ్రత్తగా పీజీ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని మంత్రి లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు ఈ సారి నీట్ పద్ధతుల్లో జరగనున్నాయన్నారు. రాష్ట్ర విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఏర్పుడుతుందన్నారు. ఆ రకంగా దాదాపు మొత్తం 8 వేల మంది విద్యార్థులకు వేసుబాటు కలుగుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా అడ్మిషన్ల ప్రక్రియను రూపొందించుకోవాలని, సజావుగా జరిగే విధంగా చూసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనా సంస్థ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, అడిషనల్ సెక్రటరీ సోని బాలదేవి, జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ సునితాదేవి, హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీహెచ్ డాక్టర్ లలిత కుమారి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.