YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాధాకు..మరో ఐదేళ్లు భాదే...

రాధాకు..మరో ఐదేళ్లు భాదే...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వంగవీటి రాధా… రాజకీయ జీవితం మరో ఐదేళ్ల పాటు బ్రేక్ పడింది. తప్పుల మీద తప్పులు చేసి తన రాజకీయ జీవితానికి తానే వంగవీటి రాధా సమాధి కట్టుకున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా లెగసీ తనకు ఎన్నటికీ ఉంటుందని, తనకు బలమైన సామాజిక వర్గం అండగా ఉంటుందని భావించిన వంగవీటి రాధా వరుసగా టర్న్ లు తీసుకుంటూ తానే పాలిటిక్స్ నుంచిటర్న్ అయిపోయారు.ప్రజల నాడిని పసిగట్టంలో పూర్తిగా రాధా విఫలమయ్యారు.వంగవీటి రాధా తొలుత కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే కాగలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి టిక్కెట్ ఇస్తామనిచెప్పినా, మంత్రి పదవి దక్కుతుందని హామీ ఇచ్చినా రాధా పెడచెవిన పెట్టి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. అప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడే దాదాపు
నాలుగేళ్ల పాటు ఉన్న వంగవీటి రాధా కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ కోసం పట్టుబట్టారు. కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు చేరడంతో ఆయనకే టిక్కెట్ దక్కుతుందని భావించిన
రాధా పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు.వంగవీటి రాధాను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకూ జగన్ పార్టీ ప్రయత్నించింది. విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేతలువచ్చి కూడా రాధాను బుజ్జగించారు. మచిలీపట్నం పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని సూచించారు.అప్పుడు కూడా రాధా ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. పైగా తన తండ్రి ద్వేషించే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అక్కడ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ రావడంతో టీడీపీలో చేరిపోయారు వంగవీటి రాధా. మచిలీపట్నం పార్లమెంటు సీటు రాధా వద్దనడంతో వల్లభనేని బాలశౌరికి టిక్కెట్ దక్కింది. ఆయన ఇప్పుడు ఎంపీగా గెలిచారు. వంగవీటి రాధా వైసీపీ అభ్యర్థిగాపోటీ చేసినా ఇప్పుడు ఎంపీ అయి ఉండేవారు.ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన రాధాకు టిక్కెట్ ఇవ్వలేదు. అనకాపల్లి పోటీ చేయమని చెప్పడంతో అందుకు రాధా అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీ తరుపున కాపు సామాజిక వర్గం బలంగాఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాను ఎమ్మెల్సీ అవుతానని రాధా భావించారు. ఇప్పడు వచ్చిన ఫలితాలను చూస్తే రాధాకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కడం కష్టంగానే ఉంది. ఎందుకంటే టీడీపీకి దక్కిన స్థానాలతో ఎమ్మెల్సీ పదవి
కూడా రావడం కష్టమే. దీంతో వంగవీటి రాధా రాజకీయంగా తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లయింది. మరో ఐదేళ్లు రాధాకు మరోసారి రాజకీయంగా విశ్రాంతి లభించినట్లే.

Related Posts