యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బొత్స సత్యనారాయణ… మాజీ పీసీసీ ప్రెసిడెంట్. మాజీ మంత్రి. దాదాపు మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయ అనుభవం. అటువంటి బొత్స విభజన తరువాత ఏమీ కాకుండా పోయారు.
2014 ఎన్నికల్లో అయిష్టంగానే కాంగ్రెస్ తరఫున చీపురుపల్లి నుంచి బరిలోకి దిగి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తరువాత వైసీపీలో చేరిన ఆయన జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీలో కీలకంగా మారారు. జగన్ నుంచి మొత్తానికి నాలుగైదు టికెట్లు తన కుటుంబానికి తెచ్చుకున్న బొత్స వాటితో పాటు మొత్తం జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసి అరుదైన రికార్డ్ సృష్టించారు. ఇక్కడ ఉన్న తొమ్మిది అసెంబ్లీ సీట్లలో వైసీపీ ఘన విజయం సాధించడం వెనక జగన్ గాలితో పాటు బొత్స రాజకీయ నైపుణ్యం కూడా దాగుంది.విజయనగరంలో వైసీపీ గాలి ఎంత బలంగా వీచిందంటే ఒక్క కోలగట్ల వీరభద్రవామి, బొబ్బిలి తప్ప మిగిలిన ఏడు అసెంబ్లీ సీట్లలో ఎక్కడా డబులు డిజిట్ కి తగ్గకుండా భారీ మెజారిటీలు వచ్చాయి. కురుపాం లో పుష్ప శ్రీవాణికి ఇరవై ఆరు వేల మెజారిటీ, సాలూరులో రాజన్నదొరకు ఇరవై వేల మెజారిటీ, పార్వతీపురంలో అలజంగి జోగారావుకు 22 వేల మెజారిటీ, ఏకంగా బొత్సకు పాతిక వేల మెజారిటీ, ఆయన తమ్ముడు గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్ధి అప్పలనరసయ్యకు 26 వేల మెజారిటీ దక్కాయి. ఇక నెల్లిమర్ల, ఎస్ కోటల్లో కూడా జెండా ఎగురవేసి టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టేసి వైసీపీ ఇక్కడ చరిత్ర తిరగరాసింది.ఇక బొత్సకు తొలి విడతలోనే మంత్రి పదవి ఖాయమన్న మాట వినిపిస్తోంది. దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కుతుందని అంటున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన ఉత్తరాంధ్రలో సీనియర్ నేత, పైగా జిల్లా మొత్తం వైసెపీని క్లీన్ స్వీప్ రికార్డ్ ఉంది. దాంతో ఉత్తరాంధ్రకు రాజకీయంగా న్యాయం చేసేందుకు జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అదే విధంగా ఈ జిల్లాకు రెండవ మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి