ఇంగ్లీష్ కాపీ జోకులు (కాకపోతే నా స్టయిల్లో) - భండారు శ్రీనివాసరావు
'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.
'ఎందుకని'
'ఖర్మ! పై బర్త్ దొరికింది'
'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?'
'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళ
ఏకాంబరం ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ బొమ్మ అతడికి యెంత మాత్రం నచ్చలేదు. 'ఇలాటి దరిద్రపు బొమ్మ పెట్టి, పైగా మోడరన్ ఆర్ట్ అంటూ పబ్లిసిటీ ఒకటీ...'
అంటూ చిందులు తొక్కాడు.
'అయ్యా అది బొమ్మకాదు. ముందు, ఆ అద్దం ఎదట నుంచి బయటకు రండి' ఎవరో అన్నారు.
'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
ఇరవై నాలుగో అంతస్తు దగ్గరకి రాగానే మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తన పేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.