యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ ని జనం విశ్వసించడం తోనే చారిత్రక తీర్పు వచ్చింది. 50శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి. జగన్ పాలనలో అందుకు తగ్గట్టుగా మార్పులు రావాలి. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే
వైఎస్సార్ గుర్తుకొచ్చారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. అవినీతిని రూపు మాపేందుకు ఉద్యోగుల జీతభత్యాల వివరాలు వెల్లడించాలి. జ్యుడీషియల్ కమిటీ సిఫార్స్ మేరకు బిల్లులు చెల్లించడం విప్లవాత్మకం. తెలంగాణ ప్రభుత్వం ఆశించినట్టు పోర్ట్ కి అవకాశం ఇవ్వాలి. వాన్ పిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు పాలనలో పనుల కన్నా ప్రచారం ఎక్కువ జరిగింది. పట్టిసీమ నీళ్లిచ్చిన చోట గన్నవరం మినహా అన్ని సీట్లు టీడీపీ కోల్పోయిందని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించాలి. గతంలో కాంగ్రెస్ కూడా 26 సీట్ల నుంచే ఎదిగింది. తెలుగుదేశం 2004లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. మద్యనిషేధానికి ముందు విస్తృతంగా ప్రచారం చేయాలి. మోడీ కి మెజార్టీ ఉంది కాబట్టి ఏమి చేయలేమనడం సరికాదు. గతంలో చంద్రబాబు మాదిరే జగన్ మాట్లాడడం నచ్చలేదు. రాజ్యాంగ బద్ధం గా రావాల్సిన వాటికోసం ప్రయత్నించాలని సూచించారు.