Highlights
ఆశిశ్ పై 20 మంది మూకుమ్మడి దాడి
బాలుడిపై దాడి చేసిన యువకులు వారించిన ఆశిశ్
దేశ రాజధాని ఢిల్లీలో రంగుల హోంలో కాస్తా రక్తం కేళిగా మారింది. సరదా సరద్దా హోలీ దారుణమైన చావుకు దారితీసింది. అందులోను పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ కిరాతక చర్య జరిగింది. ఢిల్లీలోని ఖాన్ పూర్ లో హోలీ వేడుకల సందర్భంగా ఓ బాలుడు రంగుల బెలూన్లను ఇద్దరు వ్యక్తులపై పొరపాటున విసిరాడు. దీంతో వారు ఆ బాలుడిని చితకబాదారు. దానిని చూసిన ఆశిశ్ అనే యువకుడు జోక్యం చేసుకుని, బాలుడ్ని వారి బారినుంచి కాపాడాడు.దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకులు ఆశిశ్ అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. సాయంత్రం జిమ్ నుంచి ఆశిశ్ బయటకు రాగా, వేగంగా దూసుకొచ్చిన 10 బైక్ లపై సుమారు 20 మంది యువకులు దిగి, ఆశిశ్ పై కర్రలు, రాడ్లు, కత్తులతో దాడికి దిగారు. ఒకేసారి అంతమంది దూసుకురావడంతో ఆశిశ్ ప్రతిఘటించలేకపోయాడు. క్షణాల్లో దాడి చేసిన యువకులు ఆశిశ్ నుక్షణాల్లో 50 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.