YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాజీనామా..?

Highlights

  • చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామా చేస్తానన్న అశోక్ గజపతి 
  • కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలన్న ఎంపీలు 
  • అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటా..
  • అమరావతిలో టీడీపీపీ సమావేశంలో  చంద్రబాబు
కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు రాజీనామా..?

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ కు రాజీనామా లేఖలు ఇస్తామని, రాజీనామా లేఖలు ఇప్పుడే ఇవ్వమన్నా ఇచ్చేస్తామని కేంద్ర మంత్రి వెంటనే స్పందించారు.  జాతీయ స్థాయి పోరాటం నేపథ్యంలో కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామా చేయించాలని టీడీపీ ఎంపీలు సూచించారు.అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో ఎంపీలు ఈ సూచన చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అనగా  అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. 

Related Posts