YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పాకిస్తాన్ తప్ప..మిగతా దేశాధి నేతలు

పాకిస్తాన్ తప్ప..మిగతా దేశాధి నేతలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార వేడుకను మే 30న అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బిమ్‌స్టెక్ (బీఐఎంఎస్టీఈసీ) గ్రూప్‌లోని దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. నేపాల్, భూటాన్‌ సహా.. బంగాళాఖాతం తీర దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, ఇండియా, థాయ్‌లాండ్‌లు బీఐఎంఎస్టీఈసీ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్)గా ఏర్పడ్డాయి. పొరుగు దేశాలతో సత్సంబంధాలను పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. మోదీ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనడానికి బిమ్‌స్టెక్ సభ్య దేశాలకు ఆహ్వానం పంపింది. మారిషస్, కిర్గిజ్ రిపబ్లిక్ దేశాల అధినేతలకు కూడా ఆహ్వానం పంపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మరోసారి మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కావడం లేదు. మూడు దేశాల పర్యటనలో ఆమె ఉండనుండటంతో.. భారత్ రాలేకపోతున్నారు. ఆమె బదులు బంగ్లాదేశ్ మంత్రి ఏకేఎం మొజమ్మీల్ హక్ హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రామ్ నాథ్ కోవింద్.. మోదీ, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 2014లో ప్రధాని మోదీ సార్క్ దేశాల అధినేతలను ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానించారు. ఈసారి పాక్‌కు ఆహ్వానం పంపొద్దనే ఉద్దేశంతో సార్క్ కూటమికి బదులుగా బిమ్‌స్టెక్ దేశాలకు ఆహ్వానం పంపారని భావిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ 303 స్థానాల్లో గెలుపొంది సొంతంగానే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. 1984లో తొలిసారి లోక్ సభ ఎన్నికల బరిలో దిగిన సమయంలో ఆ పార్టీ రెండు ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకుంది.

Related Posts