యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ కొత్త సీఎంగా ఈ నెల 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్... ఇతర అధికారులతో చర్చించారు. నగరంలోని మెయిన్ జంక్షన్‌లలో ఎల్ఈడీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఎండ కారణంగా అక్కడక్కడా షామియానాలు వేసి అవసరమైనచోట మంచినీరు, మజ్జిగ అందించబోతున్నారు. ఉయ్యూరులో ఎల్ ఈడీ స్క్రీన్ ఏర్పాటు చెయ్యాలనీ, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, లాయర్లు రాబోతున్నారు. భద్రతా సమస్యలు తలెత్తకుండా 5వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.ప్రధాన వేదిక ముందుభాగంలో వీవీఐపీ, వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి ప్రత్యేక పాస్‌లు ఇవ్వనున్నారు. సిటీలో మెయిన్ జంక్షన్ల దగ్గర మొత్తం 10 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎక్కడికక్కడ షెడ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లలో వాహనాల పార్కింగ్ ఉంటుంది.30న మధ్యాహ్నం 12.23కి జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఐతే, ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఐజీఎం స్టేడియంలో వేదిక, వీవీఐపీ, విఐపీ, మీడియా, సామాన్య ప్రజలు చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.