YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాడు పగిలేలా ఎండలు

మాడు పగిలేలా ఎండలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తారురోడ్లు పొయ్యి మీద పెనాల్లా మాడిపోతున్నాయి. ఇంటిపైకప్పు రేకులు మైక్రోఓవెన్‌లా మండిపోతున్నాయి. రోహిణి కార్తెలో బండరాళ్లు బద్దలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయి సెగలు కక్కుతోంది. ప్రచండ భానుడి దెబ్బకు మాడు పగిలేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వెళ్తే ఎండ..ఇంట్లో ఉంటే ఉక్కపోత..మంగళవారం రామగుండంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దేశంలో ఇదే అత్యధికం. ఆ తర్వాత నిజామాబాద్ 45.3తో రెండో స్థానంలో ఉంది. సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అటు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి.  బహదూర్‌పురా, మాదాపూర్‌లో 44,  గోల్కొండలో 43.7, శ్రీనగర్ కాలనీ, నారాయణగూడలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రానున్న రెండు మూడురోజులు కూడా రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు.  ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమరంభీమ్, మంచిర్యాల,పెద్దపల్లి, జగిత్యాల,కరీంనగర్, యాదాద్రి,జనగాం, వరంగల్,భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.నైరుతి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బాలింతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.ఎండాకాలంలో ఎండలు ఉండటం కామనే. కాకపోతే, ఈసారి వాటి తీవ్రత బాగా పెరిగిపోయింది. 40 నుంచీ 47 డిగ్రీల ఎండలొస్తున్నాయి. ఇక రోహిణీకార్తె రావడంతో... రోళ్లు పగలడం ఏమోగానీ... మనం నరకం చూస్తున్నాం. ఉక్కపోతతో చచ్చిపోతున్నాం. ఇంతలో మరో భయంకర వార్త. మరోవారం పాటూ వేడి గాలులు, ఎండలూ ఉంటాయట. ఏపీ ఆర్టీజీఎస్ అధికారులు చెబుతున్నారు. మన దురదృష్టం కొద్దీ గాలిలో తేమ తగ్గిపోయింది. అందువల్ల ప్రకాశం, కడప, కర్నూలు, కోస్తాంధ్ర జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇవాళ కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరొచ్చనే అంచనాలున్నాయి. అందువల్ల ప్రయాణాలూ, ఇతరత్రా వాయిదా వేసుకోవడం బెటర్.తెలంగాణ కూడా అగ్నిగుండంగా మారింది. పగలూ రాత్రి తేడా లేకుండా వేడి గాలులు వీస్తున్నాయి. చాలాచోట్ల 45 నుండి 47.8 డిగ్రీలు సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ సూర్యాపేట జిల్లాలోని చాలా చోట్ల 47 డిగ్రీలు ఆపైగా నమోదయ్యా యి. ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజుగా
ఆదివారం రికార్డు సృష్టించింది. ఈ నెల 30 వరకూ తెలంగాణలో వేడి గాలులు ఉంటాయట.సాధారణంగా నైరుతీ రుతుపవనాలు... జూన్ 1, 2న కేరళకు వస్తాయి. ఈసారి మాత్రం జూన్ 5 తర్వాతే వస్తాయట. ఆ తర్వాత అవి తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మరో వారం లేదా 10 రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇలాగైతే ఈ ఎండల్ని మనం తట్టుకోలేం. వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లకూడదు. ఇంట్లోనే ఉన్నా, వాటర్ బాగా తాగాలి. ఉప్పు, నిమ్మరసం కలిపిన నీరు తాగితే ఇంకా మంచిది.

Related Posts