YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్, చంద్రబాబు పిరికిపందలు

లోకేష్, చంద్రబాబు పిరికిపందలు

వైకాపా కు అఖండ విజయం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. 50 శాతం  ఓట్లతో విజయం ఆషామాషిగా వచ్చింది కాదు. జగన్  నిత్యం ప్రజలతో మమేకం అయ్యారు. అనేక పోరాటాలు చేసిన చరిత్ర జగన్ గారిది. 14 నెలలు మూడు వేల ఆరువందల కిలోమీటర్లుపైగా  పాదయాత్ర చేశారని పార్టీ అధికారప్రతినిధి కొలుసు పార్ధసారధి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. నవరత్నాలు ప్రకటించడమేకాదు.ప్రజల సమస్యలకు భరోసాఇస్తూ ముందుకు సాగారు. వీటన్నింటికి ప్రతిఫలంగానే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఈనెల 30 వతేదీన 12.23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలసాధనకోసం ఎన్నోపోరాటాలు, దీక్షలు చేశారు. రాజకీయవిలువలను కాపాడుతూ ముందుకుసాగారు. ఇద్దరితో ప్రారంభమైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజల అభిమానంతో అధికారంలోకి చేరుకుంది. ఐదేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు దుష్పరిపాలనను గుర్తించని ఎల్లోమీడియా నేడు జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాలని చూస్తోంది. గెలిచిన మరుక్షణంనుంచి రాష్ట్రానికి ఏం మేలు చేయాలనే ఉధ్దేశ్యంతో జగన్   కేసిఆర్ తో నదీజలాలగురించి మాట్లాడారు. నరేంద్ర మోది ని కలసి రాష్ట్ర్ర ఆర్దికపరిస్దితిని గురించి వివరించారు సహాయం కోరారు. కొన్ని మీడియా సంస్దలు కేంద్రంతో యుధ్దం ప్రకటించాలని ప్రచారం చేస్తున్నాయి. ముందు మేం రిక్వెస్ట్ చేస్తాం అని ప్రకటిస్తే అడుక్కోవడం అని వక్రీకరించారు. జగన్  పోరాట పటిమ గురించి రాష్ట్ర్ర ప్రజలకు తెలుసు. రాష్ట్ర్ర ప్రయోజనాలవిషయంలో జగన్ ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఉందనే విషయం అందరికి తెలుసు. రాజకీయశక్తిగా ఎదగాలనేకాదు మేలైన పరిపాలన అందించి ప్రజల హృదయాలలో స్ధానం సంపాదించాలనేది జగన్  ఆకాంక్ష. లోకేష్ మాట్లాడుతూ ఈ ఓటమి కార్యకర్తలది నేతలది అని వ్యాఖ్యానించారు. 2014లో విజయంసాధిస్తే అది చంద్రబాబు గెలుపు అని ఈరోజు ఓడిపోతే కారణం కార్యకర్తలని చెప్పడం లోకేష్ కే చెల్లిందని అన్నారు. 2009లో విజయం అయినా ఓటమి అయినా తనదే బాధ్యత అని దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. లోకేష్, చంద్రబాబులు పిరికిపందలు. అద్బుతమైన రాజధాని ఏర్పాటుచేస్తున్నానని చంద్రబాబు ప్రకటించిన చోట ఆయనకు బుధ్ది చెప్పారు. ఓటమి బాధ్యతను తోసేయడానికి ప్రయత్నం చేయకుండా  పునరాలోచన చేసుకుంటే మంచిది మీరు ఏంచేసినా కూడా రోడ్డువేసినా మేం వేశామని పెన్షన్ ఇచ్చినా మేం ఇచ్చామని  అహంకారపూరిత ధోరణితో మాట్లాడారో దానికి ప్రజలు బుధ్ది చెప్పారు. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు ఎన్టీఆర్ ను పొగిడారు. యుగపురుషుడు ఎన్టీఆర్ అని చెప్పి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఇవన్నీ ప్రజలు మరచిపోతార నకుంటే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల సొమ్ముతో ధర్మపోరాట దీక్షలనిర్వహించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా
ప్రభుత్వంపై ఆర్దికబారం పడకుండా ప్రజల ఆశీస్సులతో ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జగన్  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అయన అన్నారు.

Related Posts