యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
టిటిడి పాలకమండలి సమావేశం ప్రారంభం కాగానే ఈవో, జెఇవో వాక్ అవుట్ చేశారు. మా పాలకమండలికి ఇంకా సంవత్సరం పాటు గడవు వుంది. అధికారికంగా సమావేశం నిర్వహించే హక్కు పాలకమండలికి వుందని టీటీడీ పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం పాలక మండలి భేటీ తరువాత అయన మీడియాతో మాట్లాడారు. నూతన ప్రభుత్వం కొలువు తీరకమునుపే మమ్మల్ని రాజీనామా చేయమనడం సమంజసం కాదు. శ్రీవారి భక్తుడుగా ఛైర్మన్ పదవికి స్వయంగా రాజీనామ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రభుత్వం కొలువు తీరాక అధికారికంగా పాలకమండలిని రద్దు చేస్తే వైతొలుతామని అన్నారు. అప్పటి వరకూ చైర్మన్ గా కొనసాగుతానని అన్నారు.