YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ బోర్డు మీటింగ్ రసాభాస

టీటీడీ బోర్డు మీటింగ్ రసాభాస

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

టీడీపీ ప్రభుత్వం ఓటమిపాలయినప్పటికీ టీడీపీ బోర్డు మంగళవారం  తిరుమలలో సమావేశం కావడం వివాదాస్పదంగా మారింది.పాత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులకు రాజీనామాలు చేయాల్సి ఉన్నా టీడీపీ పాలక మండలి మాత్రం సమావేశం కు పట్టుపట్టింది.దీంతో చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బోర్డు సమావేశానికి ఏర్పాటు చేశారు అధికారులు..చైర్మెన్ పుట్టాసుధాకర్ యాదవ్ తోపాటూ కొంతమంది సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానిక హాజరయ్యారు.  .అయితే మీటింగ్ ప్రారంభం అయిన కాసేపటికే బోర్డు సభ్యలు తమను అగౌరవ పరుస్తున్నారంటూ అధికారులను నిలదీశారు.దీంతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తోపాటూ జేఈఓ ఇతర టీటీడీ అధికారులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.దీంతో సమావేశం జిరపించాల్సిన అధికారులే వెళ్లిపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ తోపాటూ ఇతర బోర్డు మెంబర్లు కూడా సమావేశంను నిలిపేసి వెళ్లిపోయారు.అధికారుల తీరుకు నిరశనగా టీటీడీ బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి ఈవో కారుదగ్గరే తన రాజీనామాను ఆయనకు అందచేశారు.మరోవైపు టీడీపీ చైర్మెన్ పుట్టాసుధాకర్ యాదవ్ కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం తమను నియమించినా ఇంకా గడువు ఉన్నందున సమావేశం ఏర్పాటుచేశామన్నారు.ఇదిలా ఉంటే టీడీపి సభ్యలు తీరుపై అధికాులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుతా తెలుస్తోంది.మరో
వైపు ఓటమిపాలైనా మిగతా ఆలయ పాలక మందళ్లు,ఇతర నామినేటె డ్ పోస్లులున్నవాళ్లు రిజైన్ చేస్తున్నా టీటీడీబోర్డు రాజీనామా చేయకుండా కొనసాగడం పై వైసీసీనేతలు ఆగ్రహం
వ్యక్తంచేస్తున్నారు.గతంలో 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయినా అప్పటి బాపిరాజు ఆధ్వర్యంలోని టీటీడీ బోర్డు కొంత కాలం కొనసాగింది.అయితే బాపిరాజు చంద్రబాబుతో సామరస్యంగా ఉండటంతో పెద్దగా ఇబ్బంది తలెత్తలేదు. అయితే ప్రస్తుతం వైసీసీ,టీడీపి నేతల మధ్య ఉన్న విభేధాల దృష్యా ఆపరిస్ధితి లేదు. మొత్తం మీద  టీడీపీ ప్రభుత్వం లేకున్నా రాజీనామాలు చేయకుండా   బోర్డు మీటింగ్ పెట్టుకున్న టీటీడీ  సభ్యులు అభాసు పాలుకావాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.

Related Posts