YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

శ్రీదేవి జీవిత కథపై వర్మ సినిమా..?

Highlights

  • గీత రచయిత సిరశ్రీ చెప్పినట్టు సమాచారం
  • కథ తుదిరూపు తర్వాత అధికారికంగా వెల్లడి
  • శ్రీదేవి కథానాయికగా ‘క్షణక్షణం, ‘గోవిందా గోవిందా’ చిత్రాలు తెరకెక్కించిన వర్మ
శ్రీదేవి జీవిత కథపై వర్మ సినిమా..?

తన ఆరాధ్య దేవత,సినీ దిగ్గజం శ్రీదేవి జీవిత కథను తెరకెక్కించేందుకు ఆమె భగ్న ప్రేమికుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ద్రుష్టి సారించారు. శ్రీదేవిపై ఏంటో ప్రేమాభిమానాలను పెంచుకున్న వర్మ  ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

ఈ విషయాన్ని వర్మకు సన్నిహితుడు, గీత రచయిత సిరశ్రీ ఓ టీవీ ఛానెల్ లో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కథ తుదిరూపు సంతరించుకోగానే, వర్మ అధికారికంగా ప్రకటిస్తారని సిరాశ్రీ చెప్పినట్టు సమాచారం. కాగా, శ్రీదేవి కథానాయికగా వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం, ‘గోవిందా గోవిందా’ తెరకెక్కిన విషయాలు తెలిసిందే.

Related Posts