యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖపట్నంలోని గాజువాక ఆటోనగర్లో విషాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ చేస్తుండగా ఆయిల్ ట్యాంకర్ పేలి నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ట్యాంకర్ భారీ శబ్ధంతో పేలడంతో
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆటోనగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. వెల్డింగ్పై అవగాహన ఉండటంతో అప్పుడప్పుడూ ఆ పని చేసేవాడు. మంగళవారం ఓ ట్యాంకర్ మరమ్మతులకు రావడంతో నాగేశ్వరరావు దానిపైకి ఎక్కి వెల్డింగ్ చేస్తున్నాడు.
ఆ సమయంలో ఒక్కసారిగా ట్యాంకర్ పేలడంతో నాగేశ్వరరావు ఎగిరిపడ్డాడు. శరీర భాగాలు చిధ్రం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అప్పారావు తీవ్రంగా గాయపడటంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఓ భవనానికి బీటలు వారాయి