YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

భారత్ కు రెండు జెర్సీలు

భారత్ కు రెండు జెర్సీలు

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌‌లో భారత్ జట్టు కొన్ని మ్యాచ్‌లకి జెర్సీ రంగుని మార్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ టీమ్‌ జెర్సీ కలర్‌ భారత్‌ జెర్సీని పోలి ఉండటంతో.. ఈ రెండు జట్లూ తలపడిన సమయంలో అభిమానులు తికమకకి గురయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భావిస్తోంది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 22న మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌‌లో ఒక జట్టు తమ జెర్సీ రంగుని మార్చుకోవాలని ఇప్పటికే ఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. టీమిండియా బ్లూ కలర్‌కి ఆరెంజ్‌ని జోడించి జెర్సీలను కూడా రూపొందించినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. భారత్ జట్టుకే కాదు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్స్‌కి కూడా ఇదే సమస్య ఎదురుకానుంది. ఈ మూడు జట్లూ గ్రీన్ కలర్ జెర్సీతోనే ప్రపంచకప్‌ ఆడబోతున్నాయి. అయితే.. ఇరు జట్లు ఢీకొన్న సమయంలో మాత్రం ఒక్క జట్టు తమ జెర్సీ కలర్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది

Related Posts